
తల్లిదండ్రుల సహకారం
ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ ఎల్కలపల్లిగేట్‌కు చెందిన సామల శంకరయ్య–సూరమ్మ దంపతుల పెద్దకుమారుడు సామల సతీశ్‌కుమార్ 154వ ర్యాంక్‌తో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగం సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సతీశ్‌కుమార్ పాఠశాల విద్యను గోదావరిఖనిలో, ఇంటర్ హన్మకొండ, బీటెక్ అనంతపురంలోని జేఎన్టీయూలో పూర్తి చేశారు. బీటెక్ పూర్తయ్యాక యూపీఎస్సీ కోసం పదేళ్ల పాటు ప్రిపేర్ అయ్యారు. ఈక్రమంలోనే సీఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్సీబ్యూరోలో ఉద్యోగం సాధించారు. ఖాళీ సమయంలో హైదరాబాద్‌లోని పలు ఇనిస్టిట్యూట్‌లలో విద్యార్థులకు యూపీఎస్సీ, పోటీ పరీక్షలపై శిక్షణ ఇచ్చేవారు. గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో రాత్రింబవళ్లు కష్టపడి ప్రిపేర్ అయి అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా కొలువు కొట్టారు.
అసిస్టెంట్ ఎకై ్సజ్
సూపరింటెండెంట్‌గా
ఎంపికైన సతీశ్‌కుమార్