
గ్రామాల అభివృద్ధికి కృషి
ధర్మపురి: గ్రామాల్లో వసతులు కల్పించి.. అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని రాయపట్నం, దోనూర్‌లో రూ.45 లక్షలతో చేపట్టనున్న పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో వంద శాతం అభివృద్ధి చేస్తామన్నారు. రాయపట్నంలో రూ.12లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణం, రూ.5లక్షలతో అంబేడ్కర్ భవనం పనులు, రూ.1.5 లక్షలతో ఎలక్ట్రికల్ లైట్లకు శంకుస్థాప న చేశారు. దోనూర్‌లో రూ.15 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.10లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేష్, కుంట సుధాకర్ తదితరులున్నారు.