
ఘనంగా బతుకమ్మ సంబరాలు
జగిత్యాలరూరల్/జగిత్యాలటౌన్/జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకేంద్రంలో గురువారం బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు ఆడిపాడా రు. డిపో మేనేజర్ కల్పన, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత పాల్గొన్నారు. ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం, ఎస్‌ఏవో తిరుపతయ్య, డీఈలు గంగారాం, మధుసూదన్ పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ కోలాటం ఆడారు. పూలను పూజించే సంప్రదాయం ఇక్కడే ఉందన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, ఏవో శశికళ, ఆర్‌ఐ కిరణ్‌కుమార్, వేణు, సైదులు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.