
ఎస్సారెస్పీకి 3.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 3.05 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి వదులుతున్నారు.
శాకంబరిగా అమ్మవారు
ధర్మపురి: దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాత్యాయనిగా అమ్మవారి దర్శనం
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో అమ్మవారు కాత్యాయినిగా దర్శనమిచ్చారు. స్థానాచార్యులు కపీందర్, ఉపప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, అర్చకులు అఖిల్ కృష్ణ అమ్మవారిని అలంకరించి, పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు
మల్లాపూర్ : ముత్యంపేటలోని చక్కెర కర్మాగారం వద్ద పరిశ్రమలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణ కు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రాములు పరిశీలించారు.
షుగర్ ఫ్యాక్టరీలను పునఃప్రారంభించే క్రమంలో రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధికారుల బృందం రానుందని, పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావాలని సూచించారు. వారి వెంట కిసాన్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పూండ్ర శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, వైస్ చైర్మన్ ఇట్టెడి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

శాకంబరిగా అమ్మవారు