
సూర్యప్రభ వాహనంపై శ్రీలక్ష్మీనృసింహుడు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే దేవుడిపై వర్షం కురిస్తే అరిష్టమని, ఈ విష యం తెలిసినా ఆలయ అధికారులు కవర్లు కప్పుకొని ఊరేగించారని పలువురు భక్తులు అనడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో సేవను నిలిపిశారు. గురువారం సేవను కొనసాగించడంపై విమర్శలు వాచ్చాయి. దీనిపై ఆలయ చైర్మన్ జక్కు రవీందర్‌ను వివరణ కోరగా.. ఊరేగింపు సమయంలో వర్షం రాలేదని, ముందు జాగ్రత్త చర్యగా కవర్లు కప్పుకొని స్వామివారి శోభాయాత్ర చేశామని పేర్కొన్నారు.
హంస వాహనంపై స్వామివారు
కోరుట్లటౌన్: పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీఅష్టలక్ష్మీ ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు కనులపండువగా నిర్వహించారు. హింస వాహనంపై స్వామివారు, గజ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చారు. మహిళలు మంగళహారతులతో పూజలు చేశారు. ఆలయాల చైర్మన్లు ఎతిరాజం నర్సయ్య, బూరుగు రామస్వామిగౌడ్, కార్యనిర్వహణాధికారి విక్రమ్, సహాయాధికారి పి.నర్సయ్య, పూజారులు బీర్నది నరసింహాచారి, ఇందుర్తి మధుసూదనచారి పాల్గొన్నారు.

సూర్యప్రభ వాహనంపై శ్రీలక్ష్మీనృసింహుడు

సూర్యప్రభ వాహనంపై శ్రీలక్ష్మీనృసింహుడు