
మహిళలు ఆరోగ్యంగా ఉండాలి
● డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్
మల్యాల: మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్ అన్నారు. స్వస్త్‌నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మండల వైద్యురాలు మౌనిక ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు, పురుషులు సుమారు 300మందికిపైగా పరీక్షలు చేశారు. గ్రామీణ మహిళలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించి చికిత్స అందిస్తే క్యాన్సర్ వంటి వ్యాధిని కూడా నియంత్రించవచ్చని అన్నారు. వైద్యులు శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.