
ప్రతీనెల తనిఖీలు చేస్తున్నాం
ప్రతీనెల 30కిపైగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించి ఔషధాలు విక్రయించే మెడికల్ షాపులపై కేసులు నమోదు చేస్తున్నాం. ఫార్మసిస్ట్‌ల పర్యవేక్షణలోనే మందుల క్రయ, విక్రయాలు సాగాలి. ఫార్మసీ చదివిన వారు సొంతంగానే వ్యాపారం చేయాలి. ఇతరులు వ్యాపారం చేయడానికి వారి సర్టిఫికెట్లు ఇవ్వకూడదు. పేషెంట్లు మందులు వాడడంలో ఫార్మసిస్ట్‌లు అవగాహన, చైతన్యం కలిగించాలి. కాలం చెల్లించిన మందులపై ఫార్మసిస్ట్‌లు పేషెంట్లకు దిశానిర్దేశం చేయాలి. – పిట్ట శ్రావణ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్