
టీజీఎన్‌పీడీసీఎల్ యాప్‌తో మరిన్ని సేవలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంలో భాగంగా టీజీఎన్‌పీడీసీఎల్ యాప్‌ను సంస్థ రూపొందించింది. వినియోగదారులకు సేవలు విస్తరించడమే లక్ష్యంగా విద్యుత్ సంస్థ ముందుకు సాగుతోంది. ఇంటి వద్ద నుంచే విద్యుత్ సేవలు పొందేలా ఈ యాప్‌ను విద్యుత్ సంస్థ అందుబా టులోకి తెచ్చింది. అత్యుత్తమ సాంకేతికతను జోడిస్తూ వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా 20 ఫీచర్లతో తయారు చేసిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు వినియోగించొచ్చు. ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని విద్యుత్ సేవలు పొందొచ్చు.
20 ఫీచర్లతో..
విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోకుండా విద్యుత్‌కు సంబంధించిన ప్రతీ అంశాన్ని యాప్‌లో రూపొందించారు. వినియోగదారులు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ సేవలు పొందొచ్చు. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్, కన్స్యూమర్ గ్రీవెన్సెస్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్‌లైన్ పేమెంట్ హిస్టరీ, కొత్త కనెక్షన్ తీసుకునేందుకు కావాల్సి న వివరాలు, లింక్ ఆధార్ అండ్ ఫోన్ నంబర్, డొమెస్టిక్ బిల్, కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి? పేరు, లోడ్ మార్పు గురించి, పవర్ కంజప్టెడ్ గైడ్‌లైన్స్, టారిఫ్ డిటేయిల్స్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్ బ్యాక్, మై ఎకౌంట్, వినియోగదారుల బిల్లు సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరాలు, కాంటాక్ట్ అజ్ వంటి ఫీచర్లు పొందుపర్చారు.
వినియోగదారులకు ఉపయోగపడేలా యాప్‌ను రూపొందించింది. విద్యుత్ కనెక్షన్ పొందడం నుంచి బిల్లింగ్, పేమెంట్ వివరాలతోపాటు అంతరాయాల సమస్యను సంబంధిత అధికారికి తెలియజేయొచ్చు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఇంటి వద్ద నుంచే యాప్ ద్వారా సేవలను పొందొచ్చు. 24/7 టోల్‌ఫ్రీ నంబర్లు పని చేస్తాయి. 18004250028, 1912 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించుకోవచ్చు.
– మేక రమేశ్‌బాబు, ఎస్‌ఈ, కరీంనగర్
20 ఫీచర్లతో ఆండ్రాయిడ్ వెర్షన్‌లో యాప్

టీజీఎన్‌పీడీసీఎల్ యాప్‌తో మరిన్ని సేవలు