
‘స్థానిక’ రిజర్వేషన్లు బహిర్గతం చేయాలి
సారంగాపూర్: ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిందని, రిజర్వేషన్ల కేటాయింపు చేపట్టిన నేపథ్యంలో అధికారులు గ్రామాలవారీగా రిజర్వేషన్లను ప్రకటించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. మండలకేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 2024 కుల గణన ఆధారంగా 42శాతం బీసీలకు కేటాయించే స్థానాలను ప్రకటించాలన్నారు. 2011 ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా వారి స్థానాలను కూడా విడుదల చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో కార్యకర్తలే సుప్రీం అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, సన్నబియ్యం పంపిణీ, సన్నాలకు రూ.500 బోనస్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ మండల నాయకులు రాంచంద్రారెడ్డి, రాజన్న, పూర్ణచందర్‌రెడ్డి, మహేశ్, గంగాధర్, గోపి, గంగారాం, ఆదర్శ్, లక్ష్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.