
పందెం కోళ్ల పెంపకంపై శిక్షణ
మంథనిరూరల్: మంథని మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామంలో రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ మహిళలకు పందెం కోళ్ల పెంపకం, నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలు, సబ్ ప్లాన్‌లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేవికే శాస్త్రవేత్తలు మహిళలకు పలు సూచనలు చేశారు. దేశీకోళ్ల కాన్న అత్యధిక వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని, వేగంగా పరుగెత్తడం, శత్రువులను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు అధికంగా ఉండడం వీటి లక్షణమన్నారు. ఆరునెలల్లోనే రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు బరువు పెరుగుతాయని తెలిపారు. ఆడకోళ్లు 120 నుంచి 140 గుడ్లు పెడతాయని వివరించారు. అనంతరం ఒక్కొక్కరికి పది కోడిపిల్లలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వై.వెంకన్న, కిరణ్, బండారి నరేశ్, నాయకులు పేరవేన లింగయ్య, మంథని సత్యం, ప్రభాకర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్, ఆర్ల నారాయణ, సదానందం తదితరులు పాల్గొన్నారు.