ఆశావహుల్లో టెన్షన్‌! | - | Sakshi
Sakshi News home page

ఆశావహుల్లో టెన్షన్‌!

Sep 25 2025 7:11 AM | Updated on Sep 25 2025 7:11 AM

ఆశావహుల్లో టెన్షన్‌!

ఆశావహుల్లో టెన్షన్‌!

● ‘రిజర్వేషన్ల’పై సర్వత్రా చర్చ ● ఏ స్థానం ఎవరికో..? ● ఆందోళనలో నాయకులు

జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఊపందుకుంది. పంచాయతీల పాలకవర్గం ముగిసి నెలలు గడుస్తుండడం.. ఈనెల 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం.. సమయం దగ్గర పడడంతో అధికారులు ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఆ వివరాలన్నింటినీ ప్రభుత్వానికి కూడా పంపించినట్లు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు కానుండటంతో విధివిధానాలను బట్టి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

అంతటా అదే చర్చ..

స్థానిక రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఎక్కడ నలు గురు కలిసినా రిజర్వేషన్లపైనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా గతంలో ఉన్న రిజర్వేషన్లు, స్థానాలు కచ్చితంగా మారుతాయని ఉన్నతాధికారుల నుంచి సమాచారం వస్తుండడంతో ఏ స్థానం ఎవరికి దక్కుతుందోనన్న ఆందోళన ఆశావహుల్లో నెలకొంది. కొందరు ఏకంగా జిల్లా అధికారులకు ఫోన్‌ చేసి ఏ రిజర్వేషన్‌ వస్తుందంటూ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రిజర్వేషన్లపై జోరుగా ప్రచారం ఊపందుకుంది. లోగుట్టుగా ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి పంపించడంతో ఆశావహుల్లో రిజర్వేషన్లపై తీవ్రమైన ఉత్కంఠ కన్పిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తున్న నేపథ్యంలో వారికి స్థానాలు అత్యధికంగా పెరిగే అవకాశాలున్నాయి.

ఎవరికి ఏ స్థానాలో..?

ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలు చాలా ఆలస్యం కావడంతో ఆశావహుల్లో నిరాశ వ్యక్తమైంది. రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తాజాగా టెన్షన్‌ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనుండటంతో ఏవి వస్తాయో..? స్థానం దక్కుతుందో..? లేదోనన్న టెన్షన్‌ మొదలైంది. ఇటీవల కులగణన సర్వే లెక్కల ఆధారంగా 42 శాతం బీసీలకు కేటాయించనున్న నేపథ్యంలో బీసీలకు ఎక్కువగా స్థానాలు లభించే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు సభ్యులకు రిజర్వేషన్లు కేటాయించారు. జిల్లాలో 22 గ్రామపంచాయతీల్లో పూర్తిగా ఎస్టీలు ఉండటంతో వారికే ఆ స్థానాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు బయటకు చెప్పవద్దని, గోప్యంగా ఉంచాలని హెచ్చరికలు రావడంతో అధికారులు కూడా బయటకు ఏమీ చెప్పకుండానే లోలోపల తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.

సమాచార సేకరణలో బిజీబిజీ

రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారని ప్రచారం కావడంతో సమాచార సేకరణలో

నాయకులు బిజీ అయ్యారు. ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్‌ వర్తిస్తుంది..? ఈ సారి అవకాశం వస్తుందా..? లేదా..? ఏదైనా వేరే అవకాశం చూసుకోవాలా..? అనే దానిపై ప్రతి ఒక్కరు ఫోన్లు చేసుకుంటున్నారు. రిజర్వేషన్లపైనా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఒక ముందడుగు వేయడం.. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం పూర్తి చేయడంతో

ఆశావహుల్లో సందడి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement