
పండుగలకు పటిష్ట భద్రత
జగిత్యాలక్రైం: దుర్గా శరన్నవరాత్రోత్సవాలు, బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు కల్పించాలని, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వొద్దని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పట్టణ, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులు, కేసు డైరీలు, రిజిస్టర్లను పరిశీలించారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. డయల్ 100 కాల్‌రాగానే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ నిరంతరం గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. పండుగల సందర్భంగా శాంతిభద్రతల సమస్య రానివ్వొద్దని సూచించారు. సీఐ కరుణాకర్, ఎస్సైలు సుప్రియ, కుమారస్వామి, మల్లేశ్, రవికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.