
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
కథలాపూర్: విద్యుత్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. మండలంలోని గంభీర్‌పూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఇంటర్ లింకింగ్ సిస్టంను బుధవారం ప్రారంభించారు. గంభీర్‌పూర్, భీమారం మండలం గోవిందారంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ల మధ్య కొత్తగా విద్యుత్ స్తంభాలు, వైర్లను ఏర్పాటు చేశామన్నారు. సరఫరాలో సమస్యలు వస్తే ఒక సబ్‌స్టేషన్ నుంచి మరో సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ను సరఫ రా చేయవచ్చని కొత్తగా లైన్లు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో డీఈలు మధుసూదన్, గోపాలకృష్ణ, ఏడీఈలు రఘుపతి, రాజబ్రహ్మచారి, ఏఈ భూమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.