
60 క్వింటాళ్ల బోనస్ రాలే..
నేను 60 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని గడిచిన యాసంగిలో అమ్మిన. బోనస్ రూపంలో రూ.30వేలు రావాల్సి ఉంది. రెండు రోజుల్లోనే క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు నెలలైనా ఇవ్వడంలేదు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన.
– ఏలేటి మహేశ్ రెడ్డి, కొత్తదాంరాజ్ పల్లి, మల్లాపూర్ మండలం
90క్వింటాళ్లు అమ్మిన
నేను 90 క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మిన. రూ.500 చొప్పున నాకు రూ.45వేల బోనస్ రావాలి. ఇప్పటివరకు రాలేదు. సన్న ధాన్యం సాగు చేయాలంటేనే భయమేసే పరిస్థితి నెలకొంది. ఫోన్‌కు ఏ మేసేజ్ వచ్చినా బోనస్ అనుకుంటున్నాం. ఊరిలో చాలామందికి రావాల్సి ఉంది.
– మిట్టపెల్లి గంగారెడ్డి, కొత్త దాంరాజ్‌పల్లి, మల్లాపూర్ మండలం

60 క్వింటాళ్ల బోనస్ రాలే..