
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
ఇబ్రహీంపట్నం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో 21 మంది లబ్ధిదారులకు రూ.5.10లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయామన్నారు. సోయిలేకుండా ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడం లేదన్నారు. మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కో–ఆప్షన్ ఏలేటి చిన్నారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎలాల దశరథ్‌రెడ్డి, నాయకులు జాజాల జగన్‌రావు, సున్నం స త్యం, నేమూరి నరేష్, తదితరులు పాల్గొన్నారు.