ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో

Sep 25 2025 7:11 AM | Updated on Sep 25 2025 2:45 PM

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 40 గేట్లు ఎత్తి 3,85,160 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

మంటపాల వద్ద సౌకర్యాలు కల్పించాలని..

జగిత్యాలటౌన్‌: దుర్గామాత మంటపాల వద్ద సౌకర్యాలు కల్పించాలని భవానీ దీక్షాస్వాములు డిమాండ్‌ చేశారు. టీఆర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపం వద్ద మొరం, లైటింగ్‌ ఏర్పాటు చేయాలని పలుమార్లు బల్ది యా అధికారులను కోరినా స్పందించడం లేద ని బుధవారం జగిత్యాల బల్దియా ఎదుట బై టాయించారు. దుర్గామాత మంటపంతో పా టు పాత బతుకమ్మ ఘాట్‌ వద్ద లైటింగ్‌ ఏర్పా టు చేయాలని కోరారు. కమిషనర్‌ స్పందన స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కోటగిరి మోహ న్‌, గజేందర్‌, భవానీలు పాల్గొన్నారు.

చెరుకు రైతుల కల నెరవేరబోతోంది

మల్లాపూర్‌ : షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే చెరుకు రైతుల కల నెరవేరబోతోందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణలో భాగంగా రూ.200కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పరిశ్రమలు, వ్యవసాయశాఖ అధికారుల బృందాన్ని ఈ 26న షుగర్‌ ఫ్యాక్టరీ వద్దకు పంపి రైతుల అభిప్రాయం సేకరించనుందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ తెరవాలంటే కనీసం 10వేల ఎకరాల్లో చెరుకు సాగు అవసరమని, తాము సాగు చేస్తామని రైతులు తెలపాలని కోరారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంతడుపుల పుష్పలత, వైస్‌ చైర్మన్‌ ఇట్టెడి నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పూండ్ర శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నల్ల బాపురెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ నల్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు చల్‌గల్‌ విద్యార్థిని

జగిత్యాలరూరల్‌: చల్‌గల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన విద్యార్థిని శిరిణ్‌ మిత్ర రాష్ట్రస్థాయి కబడ్డీ సబ్‌ జూనియర్‌ పోటీలకు ఎంపికై నట్లు పీడీ వెంకటలక్ష్మీ తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్‌లో జరిగే కబడ్డీ పోటీల్లో శిరిణ్‌మిత్ర పాల్గొంటుందని పేర్కొన్నారు. శిరిణ్‌ను బుధవారం హెచ్‌ఎం లతాదేవి, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్‌ నీరటి సుకన్య, ఉపాధ్యాయులు అభినందించారు.

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

మల్యాల: పిల్లలు, గర్భిణులకు పోషకాహారం అందించి, ఆరోగ్య తెలంగాణలో భాగస్వామ్యం కావాలని శిశు సంక్షేమశాఖ జిల్లా అధి కారి బి.నరేశ్‌కుమార్‌ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో బుధవారం స్వస్త్‌నారీ శక్తి అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ టీచర్లు పోషకాల స్టాళ్లను ప్రదర్శించారు. రంగులతో ముగ్గులు వేశారు. పోషకాలతో తయా రు చేసిన పిండి వంటలు, మిల్లెట్స్‌, స్టాళ్లను నరేశ్‌ పరిశీలించారు. బేటీ పడావో.. బేటీ బచావోపై అవగాహన కల్పించారు. సీడీపీఓ వీరలక్ష్మీ, డాక్టర్‌ జైపాల్‌ రెడ్డి, ఏసీడీపీఓ అరవింద, సూపర్‌వైజర్లు పవిత్ర, శారద, సిబ్బంది స్వప్న, గౌతమి పాల్గొన్నారు.

ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో1
1/2

ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో2
2/2

ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement