
అభివృద్ధి కోసమే సీఎం వెంట
రాయికల్: జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంతో కలిసి నడుస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్‌లో బుధవారం ఇందిర మహిలాశక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని, రూ.కోట్ల బకాయిలు విడుదల చేయించానని గుర్తుచేశారు. తనను గెలిపించిన ప్రజలు, అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తానన్నారు. రాజకీయంలో ఉన్నన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్యాంటీన్లలో స్టీల్ పాత్రలు వినియోగించాలన్నారు. రాయికల్‌కు మంజూరైన రూ.15 కోట్లతో సీసీరోడ్లు, ఆలయాలు, ఇతరత్రా వసతులు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ మనోహర్‌గౌడ్, మెప్మా ఏవో శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ రమాదేవి, డీఎంసీ సునీత, టీఎంసీ శరణ్య పాల్గొన్నారు.