
తండాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
పెగడపల్లి: తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ప్రతి తండాలో గిరిజన భవనం నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు. మండలంలోని కీచులాటపల్లి నుంచి మల్లాపూర్ వరకు రూ.8 కోట్లు, ఏడుమోటలపల్లి తండా నుంచి పెగడపల్లి వరకు రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రహదారులను బుధవారం పరిశీలించారు. కాంట్రాక్టర్లు ఇష్టారీతిన నష్టపరుస్తున్నారని ఇరువైపులా సమానంగా భూమి తీసుకో వడం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వివరించారు. పరిష్కారానికి ప్రతిపాదనలు పంపాలని ఎస్‌ఈ సుదర్శన్‌కు మంత్రి సూచించారు. అంతకుముందు అమ్మవారలను దర్శించుకున్నారు. అనంతరం 78 మందికి ప్రమాద బీమా పరిహారం చెక్కులు అందించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, డీసీవో మనోజ్‌కుమార్, గొల్లపల్లి ఏడీఈ వరుణ్‌కుమార్ పాల్గొన్నారు.