
దుర్గామాతకు తెప్పోత్సవం
రాయికల్: మండలంలోని కుమ్మరిపల్లిలో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గమాతకు బుధవారం అర్చకులు రామగోపాలాచార్యుల ఆధ్వర్యంలో తెప్పోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మూల విరాట్‌్‌కు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం చెరువులో తెప్పోత్సవం చేపట్టారు. మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మంగళహారతులతో మహిళలు
అమ్మవారి తెప్పోత్సవంలో అర్చకులు

దుర్గామాతకు తెప్పోత్సవం