
‘డిజిటల్ అరెస్ట్’.. సైబర్ మోసం
జగిత్యాలక్రైం: డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మోసమని, దానిని ఎవరూ నమ్మవద్దని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు తాము పోలీస్ అధికారులమని, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది అంటూ నటిస్తూ.. కేసు ఉందని భయపెట్టడం, వీడియో కాల్‌లో అరెస్ట్ చేస్తున్నామని చూపించ డం, డబ్బులు బదిలీ చేస్తే తప్పించుకోవడం డిజి టల్ అరెస్ట్ అని తెలిపారు. ఇలాంటి నేరాలపై ప్ర జలు అవగాహన పెంచుకోవాలన్నారు. మోసపో తే వెంటనే 1930కు కాల్ చేయాలని, తద్వారా డ బ్బు రికవరీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఆలస్యం చేస్తే నష్టపోతారని హెచ్చరించారు.
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలకు సూచనలు