టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం | - | Sakshi
Sakshi News home page

టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం

Sep 24 2025 5:25 AM | Updated on Sep 24 2025 5:25 AM

టీబీ

టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం

● ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శన్‌

కోరుట్లటౌన్‌: టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూత ఇవ్వాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ అన్నారు. కోరుట్ల ఏరియా ఆసుపత్రిలో స్వస్త్‌ నారి శక్తి పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు ముందుకొచ్చి క్షయ రోగులను ఆదుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ మాట్లాడుతూ క్షయ రోగులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి ఆకుల శ్రీనివాస్‌, ఐఎంఏ డాక్టర్లు వై.అనూప్‌రావు, రేగొండ రాజేశ్‌, వినోద్‌, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 40 గేట్లు ఎత్తి, 2,84,866 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 2.22 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. వరద కాలువకు 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5,500, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కెనాల్‌కు 400, లక్ష్మి కెనాల్‌కు 200, అలీసాగర్‌ ఎత్తి పోతల పథకానికి 180, మిషన్‌ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.

‘ఒకే దేశం ఒకే పన్ను’ అమలు చేయాలి

జగిత్యాలటౌన్‌: జీఎస్టీ తెచ్చిన మోదీ ప్రభుత్వం తన తప్పును గ్రహించి సరళీకృతం చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పన్ను మినహాయింపు ఇచ్చామంటే ఇప్పటివరకు పన్నుల భారం మోపామని కేంద్రం ఒప్పుకున్నట్లేనన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ప్రధాని మోదీ పెట్రోల్‌, డీజిల్‌పై ఒకేదేశం ఒకే పన్ను విధానం అమలు చేయాలని, 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. జీఎస్టీ పన్నుల సరళీకరణతో కలిగే లబ్ధిని వినియోగదారులకు చేరేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. నాయకులు బండ శంకర్‌, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్‌, జున్ను రాజేందర్‌, రఘువీర్‌గౌడ్‌, గుండ మధు పాల్గొన్నారు.

అంతరాయం రాకుండా అదనపు బ్రేకర్లు

ఇబ్రహీంపట్నం/మల్లాపూర్‌: నాణ్యమైన విద్యుత్‌ సరఫరాలో అంతరాయం రాకుండా అదనపు బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శన్‌ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌, వేములకుర్తి, మల్లాపూర్‌ సబ్‌స్టేషన్‌లో బ్రేకర్లు, ఇంటర్‌ లింకింగ్‌ను ప్రారంభించారు. రూ.20 లక్షలతో రెండు బ్రేకర్లను ఏర్పాటు చేశామన్నారు. అన్ని సబ్‌స్టేషన్లకు రెండో ప్రత్యామ్నాయ లైన్లు వేస్తున్నామని, 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రైతులు కెపాసిటర్లు బిగించుకోవాలన్నారు. మెట్‌పల్లి డివిజన్‌ డీఈ మధుసూదన్‌, ఎమ్మార్టీ డీఈ రవీందర్‌ పాల్గొన్నారు.

అనంత దీపోత్సవం

ధర్మపురి: దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి అనంత దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగనంలో ఓం, స్వస్థిక్‌, మహాలింగేశ్వర ఆకారాలతో విద్యుత్‌ ద్వీపాలను అలంకరించారు.

టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం1
1/3

టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం

టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం2
2/3

టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం

టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం3
3/3

టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement