
గాయత్రీదేవిగా అమ్మవారు
బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు
ధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం పసుపురంగు వస్త్రంలో బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని న్యూ టీటీడీ కల్యాణ మండపంలో నవదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి
ఆలయంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాల సందడి నెలకొంది. మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అమ్మవారు గాయత్రిదేవి రూపంలో దర్శనం ఇచ్చారు. లంబాడిపల్లిలో శ్రీపద్మసహిత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని గాయత్రిదేవిగా అలంకరించారు.

గాయత్రీదేవిగా అమ్మవారు