
మహిళా ఆరోగ్యంతోనే మంచి కుటుంబం
కోరుట్లరూరల్/కోరుట్ల: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే శక్తివంతమైన కుటుంబం తయారవుతుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. స్వస్త్‌నారి స్వశక్తి పరివార్ అభియాన్‌లో భాగంగా అయిలాపూర్ పీహెచ్‌సీలో వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌వో ప్రమోద్‌తో కలిసి ప్రారంభించారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.
సీఎంది బజారుభాష..
మల్లాపూర్: సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ, బహిరంగసభల్లో బజారుభాష మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడదామన్నారు. పదేళ్లుగా లేని యూరియా కష్టాలు కాంగ్రెస్ పాలనలో ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్దిచెప్పాలని కోరారు. అనంతరం దుర్గాదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు మేలు
మెట్‌పల్లి: సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పేదలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని 52మందికి రూ.13.98లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అందించారు.