
సూర్య ప్రభ వాహనంపై శ్రీనివాసుడు
కోరుట్ల: పట్టణంలోని అతి పురాతన శ్రీవేంకటేశ్వర ఆలయం, అష్టలక్ష్మీ సహిత శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేంకటేశ్వర ఆలయంలో సూర్యప్రభ వాహనంపై.. అష్టలక్ష్మీ ఆలయంలో హనుమత్‌వాహనంపై స్వామివారలు భక్తులకు దర్శనమిచ్చారు.
ఉత్పత్తుల మేళాకు మహిళలు
జగిత్యాలజోన్: హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరుగుతున్న జాతీయస్థాయి మహిళాసంఘాల ఉత్పత్తుల మేళాకు మంగళవారం జిల్లా నుంచి మహిళాసంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు. వారి బస్సును డీఆర్డీఏ పీడీ రఘువరణ్ ప్రారంభించారు. అక్కడికెళ్లిన మహిళలు ఆయా రాష్ట్రాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు, అమ్మకాలు, మార్కెటింగ్, తీసుకున్న రుణం, శిక్షణ ప్రమాణాలపై అడిగి తెలుసుకున్నారు. సెర్ప్ అధికారులు ఉత్పత్తుల ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యంపై అవగాహన కల్పించారు. ఏపీడీ సునీత, డీపీఎం రమేశ్, జిల్లా ఏపీఎం వి.గంగాధర్, సీసీ సత్యనారాయణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరోజన, కార్యదర్శి ఆమని పాల్గొన్నారు.

సూర్య ప్రభ వాహనంపై శ్రీనివాసుడు