
శాతవాహన స్నాతకోత్సవానికి రండి
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. గవర్నర్, శాతవాహన చాన్స్‌లర్ జిష్ణుదేవ్‌వర్మ నవంబర్ 7న స్నాతకోత్సవం నిర్వహణకు అనుమతినిచ్చినట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు హాజరుకానున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్‌డీ పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలు అందజేస్తామన్నారు. 2019 ఆగస్టులో తొలిస్నాతకోత్సవం జరిగిందని, ఇప్పుడు ద్వితీయ స్నాతకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.