
గ్రామాల అభివృద్ధికి కృషి
ధర్మపురి: గ్రామాల్లో అన్ని రకాల వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని నాగారంలో రూ.54 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను సోమవారం మంత్రి ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్ అందిస్తున్నామని, రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు. కుల సంఘాలు సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేష్, గడ్డం భాస్కర్‌రెడ్డి తదితరులున్నారు.