
కొలువుదీరిన అమ్మవారు
జగిత్యాలటౌన్/రాయికల్/ధర్మపురి/మల్యాల/సారంగాపూర్/కోరుట్ల: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు మంటపాల్లో కొలువుదీరారు. జిల్లాకేంద్రంలో కొందరు మండపాల నిర్వాహకులు అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. టవర్‌సర్కిల్ వద్ద అమ్మవారి శోభాయాత్ర సందర్భంగా నిత్య జనగణమన ప్రారంభం కావడంతో భక్తులు జాతీయ గీతాలాపనలో పాల్గొని సెల్యూట్ చేశారు. ధర్మపురిలో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు. కొండగట్టు అమ్మవారి ఆలయంలో మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాయికల్‌లో యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. బాలత్రిపుర సుందరిదేవీగా అలంకరించారు. బీర్‌పూర్ మండలం తుంగూర్‌లో అమ్మవారిని శోభాయాత్రగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు.

కొలువుదీరిన అమ్మవారు

కొలువుదీరిన అమ్మవారు