
బీఆర్‌ఎస్ హయాంలో చేసిందేమిటి..?
ధర్మపురి: పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రజలకిచ్చి న హామీలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడా రు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి రెండేళ్లు కాలేదని, ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని, బీఆర్‌ఎస్ ఓర్వలేక ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమిటో చెప్పాలన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో ధర్మపురి ఆలయానికి రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించి మాట తప్పారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామన్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ధర్మపురిలో డిగ్రీ కళాశాల, పాల్‌టెక్నిక్, బస్‌డిపో, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తానన్నారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు ఉన్నారు.