
వరి పంటే లాభముంది
మొక్కజొన్న, కంది, పెసర వంటి వాటితో పోల్చితే వరి పంటే లాభంగా ఉంది. ట్రాక్టర్‌తో దున్నించి, నాటు వేసి, రోజు నీళ్లు చూసుకుంటే సరిపోతుంది. హార్వేస్టర్‌తో కోయించి, కొనుగోలు కేంద్రంలో పోస్తే అమ్ముకోవచ్చు. నేను మూడెకరాల్లో వరి సాగు చేశాను.
– బందెల మల్లయ్య, చల్‌గల్
సాగునీరు పుష్కలం
నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. వరి పంటను తగ్గించి ఇతర పంటల వైపు రైతుల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు.
– వడ్డెపల్లి భాస్కర్, డీఏవో

వరి పంటే లాభముంది