
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేటకు చెందిన బానోత్ సిద్దూ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పీడీ రవీందర్ తెలిపారు. బానోత్ సిద్దూ కథలాపూర్ మోడల్‌స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇటీవలే జగిత్యాలలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో సిద్దు ప్రతిభ చాటారన్నారు. నిజామాబాద్‌లో ఈనెల 25 నుంచి జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సిద్దు మన జిల్లా తరఫున పాల్గొంటాడని పేర్కొన్నారు. విద్యార్థిని ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయులు అభినందించారు.