
హైకోర్టు జడ్జికి ఘనస్వాగతం
జగిత్యాలక్రైం:జిల్లా కోర్టులో నిర్వహించిన సమావేశానికి హైకోర్టు న్యాయమూర్తి రేణుక యారను రాగా.. ఆమెకు ఘన స్వాగతం లభించింది. పోలీసు గౌరవ వందనం స్వీకరించి జ్యుడిషియల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు. జిల్లా జడ్జి రత్న పద్మావతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మారుతి పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జగిత్యాలరూరల్: పర్యావరణ పరిరక్షణ అంద రి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ జెడ్పీ పాఠశాలలో ఏక్‌పేడ్ అప్నే మా కే నామ్‌పే కార్యక్రమంలో భాగంగా శనివారం మొక్కలు నాటారు. పర్యావరణ అసమతుల్య తతో మానవాళికి ముప్పు ఉందన్నారు. ఇందు కు విరివిగా మొక్కలు నాటి సంరక్షించుకోవా లన్నారు. ఎంపీవో రవిబాబు, హెచ్‌ఎం స్వరూపరాణి, ఉపాధ్యాయులు రమేశ్ పాల్గొన్నారు.
డీలర్లు నిబంధనలు పాటించాలి
మెట్‌పల్లి రూరల్/కోరుట్లరూరల్: ఫర్టిలైజర్ షాపుల డీలర్లు వ్యవసాయ శాఖ నిబంధనల మేరకు ఎరువులు విక్రయించాలని డీఏవో భాస్కర్ అన్నారు. మెట్‌పల్లి, వెల్లుల్ల, బండలింగాపూర్, కోరుట్ల మండలంలోని మాదాపూర్‌లోని ఫర్టిలైజర్ షాపులు, ఎరువుల గోదామును శనివారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ–పాస్ ద్వారానే ఎరువుల విక్రయించాలని సూచించారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మెట్‌పల్లి ఇన్‌చార్జి ఏవో లావణ్య, కోరుట్ల మండల ఏవో నాగమణి, సీఈఓ మహేందర్, ఏఈఓలు రాఘవేంద్ర, మమత ఉన్నారు.
రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు మోడల్‌స్కూల్ విద్యార్థులు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్‌స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న పేరాల కృష్ణిక రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ వినిత్, అజీమ్ తెలి పారు. అండర్–14 బాలికల విభాగంలో చెస్ లో కృష్ణిక అత్యంత ప్రతిభ కనబర్చింది. కృష్ణికను పాఠశాల ప్రిన్సిపాల్ సరితాదేవి, వైస్ ప్రిన్సిపల్ నగేశ్, ఉపాధ్యాయులు అభినందించారు.
చెస్, తైక్వాండో పోటీలకు తక్కళ్లపల్లి విద్యార్థులు
మల్యాల: మల్యాల మండలం తక్కళ్లపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఎ.విష్ణువర్ధన్, ఎం.లతిక జిల్లాస్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తైక్వాండో పోటీల్లో ఎం.లాత్విక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. విద్యార్థులను హెచ్‌ఎం జి.శాంతిరాజు, పీడీ అంకం శేఖర్, ఉపాధ్యాయులు అభినందించారు. తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థులు జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు పీఈటీ మధులిక తెలిపారు.

హైకోర్టు జడ్జికి ఘనస్వాగతం

హైకోర్టు జడ్జికి ఘనస్వాగతం

హైకోర్టు జడ్జికి ఘనస్వాగతం

హైకోర్టు జడ్జికి ఘనస్వాగతం