
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
జగిత్యాల:విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ప్రారంభించారు. గెలుపోటములు సహజమని, ఓడిన వారు విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. యువజన క్రీడల అభివృద్ధి అధికారి రవికుమార్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, డీఆర్డీవో రఘువరన్ పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
జిల్లా కేంద్రంలోని 5, 11 వార్డుల్లోని ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, రవాణా, కూలీల ఖర్చులు భరించుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, వార్డు ఆపీసర్లు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్
జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి రేణుక యారను కలెక్టర్, ఎస్పీ అశోక్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆర్డీవో మధుసూదన్ ఉన్నారు.
భవిత సెంటర్లను పూర్తి చేయాలి
అంగన్‌వాడీ, భవిత సెంటర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. భవన నిర్మాణాలపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. అధికారులు అంగన్‌వాడీ, భవిత సెంటర్, పంచాయతీ, పాఠశాలలో కిచెన్ షెడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. దసరా సెలవుల్లోపు పనులన్నీ పూర్తి కావాలన్నారు.
జాతీయ రహదారిపై రైతుల అభ్యంతరాలు
జాతీయ రహదారి 563 విస్తరణకు రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో కలెక్టర్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరుఫున న్యాయవాదులు వివరించారు. జాతీయ రహదారి విస్తరణలో కొడిమ్యాల మండలం గౌరాపూర్‌కు చెందిన రైతుల భూములు పోతున్నాయని, రైతులు అభ్యంతరం చెబుతున్నారని అన్నారు. రైతులు సమర్పించిన ఆధారాలు, అభ్యంతరాలపై భూసేకరణ అర్బిట్రేషన్ అప్పిల్ హియరింగ్ నిర్వహించారు.