
బయో వ్యర్థాలపై నిర్లక్ష్యం వద్దు
మెట్‌పల్లి: బయో వ్యర్థాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మెట్‌పల్లి బల్దియా కమిషనర్ మోహన్ అన్నారు. బయో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్న వైనంపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్‌ఎంపీలతో సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే ప్రజలు, మూగజీవాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థకు అందించాలన్నారు. ఆర్‌ఐ అక్షయ్ ఉన్నారు.
పింఛన్ పెంచాలని గ్రామపంచాయతీల ముట్టడి
జగిత్యాలరూరల్: మేనిఫెస్టోలో ప్రకటించినట్టు దివ్యాంగులకు రూ.6 వేలు, చేయూత రూ.4 వేలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం మాదిగ ఆధ్వర్యంలో పొరండ్ల, బాలపల్లి పంచాయతీ కార్యాలయాలను ముట్టడించారు. పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. 22 నెలలు గడుస్తున్నా నెరవేర్చడం లేదన్నారు. పెన్షన్లు పెంచకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు. మెడపట్ల చంద్రశేఖర్, తోట రాజేశ్, మెడపట్ల రమేశ్, శిరీష, సుశీల, లక్ష్మీ పాల్గొన్నారు.

బయో వ్యర్థాలపై నిర్లక్ష్యం వద్దు

బయో వ్యర్థాలపై నిర్లక్ష్యం వద్దు