
సైబర్‌క్రైం ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
జగిత్యాలక్రైం: సైబర్‌క్రైం ఫిర్యాదులపై తక్షణం స్పందించి విచారణ వేగవంతం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సైబర్‌నేరాల దర్యాప్తు, కేసుల పురోగతిపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సైబర్‌నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితుల డబ్బులు ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో సైబర్‌క్రైం కేసులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని సీఐలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండాలన్నారు. బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాకింగ్, లాటరీ మోసాలు, ఉద్యోగాల పేరుతో డబ్బులు దోచుకోవడం వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు, సోషల్ మీడియా ద్వారా విస్త్తృత ప్రచారం చేపట్టాలన్నారు. సమావేశంలో సైబర్‌క్రైం డీఎస్పీ వెంకటరమణ, సీఐలు అనిల్‌కుమార్, సురేశ్, రామ్‌నరసింహారెడ్డి, సుధాకర్, కరుణాకర్, రవి, సైబర్ ఎస్సై కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
జిల్లాలో పని చేస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్‌ను శుక్రవారం హోంగార్డులకు అందజేశారు. వర్షాకాలం, చలికాలంలో హోంగార్డ్స్ ఇబ్బందిపడకుండా సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్‌ఐ సైదులు, సిబ్బంది పాల్గొన్నారు.