
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలో రూ.కోటితో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాయికల్‌లోని ప్రతి వార్డులో రూ.15 కోట్ల నిధులతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ మనోహర్, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, మాజీ వైస్ చైర్మన్ రమాదేవి, నాయకులు పడిగెల రవీందర్‌రెడ్డి, కోల శ్రీనివాస్ పాల్గొన్నారు.
జగిత్యాలక్రైం: జిల్లాలోని ప్రతీ బ్యాంకు ఏటీఎంల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ అన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏటీఏంల వద్ద సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు, అలారమ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద అనుకోని ఘటన జరిగితే సిబ్బంది ఎలా ప్రతిస్పందించాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై కుమారస్వామి పాల్గొన్నారు.