
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 10,775 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 7,261 మార్క్ చేయగా, 2,569 బేస్‌మెంట్‌స్థాయి, 428 గోడల నిర్మాణం, 165 స్లాబ్ దశకు చేరుకున్నాయని వివరించారు. ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించకుంటే ఇతరులకు కేటాయించాలని ఆదేశించారు. జగిత్యాలలో ఇసుక బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని, లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక లభిస్తుందన్నారు.
ఆరోగ్యం స్వచ్ఛత అందరి బాధ్యత
ఆరోగ్యం స్వచ్ఛత మనందరి బాధ్యత అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెత్తనిల్వ ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలని, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్, శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్ పాల్గొన్నారు.