● ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు? ● మహిళా ఉద్యోగులకు రక్షణ ఏది.. ● కమిటీలు నామమాత్రమేనా? | - | Sakshi
Sakshi News home page

● ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు? ● మహిళా ఉద్యోగులకు రక్షణ ఏది.. ● కమిటీలు నామమాత్రమేనా?

Sep 20 2025 7:02 AM | Updated on Sep 20 2025 7:02 AM

● ఇంక

● ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు? ● మహిళా ఉద్యోగులకు రక్షణ ఏ

● ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు? ● మహిళా ఉద్యోగులకు రక్షణ ఏది.. ● కమిటీలు నామమాత్రమేనా?

ఎవరికీ భయపడొద్దు

జగిత్యాల: మహిళా ఉద్యోగులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకుంటున్నా వేధింపులు ఆగడం లేదు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను తోటి ఉద్యోగులు వేధిస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు ప్రతీశాఖలో మహిళా కమిటీలను ఏర్పాటు చేశారు. వేధింపులకు గురైనవారు కమిటీకి ఫిర్యాదు చేస్తే వారు పూర్తిస్థాయిలో విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ, జిల్లాలో వేధింపుల ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో అధికారుల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతూ.. ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్న వారు ఉందరో ఉన్నారు.

లోలోనే కుమిలిపోతూ..

ప్రతీశాఖలో కమిటీతో పాటు, జిల్లాస్థాయిలో సైతం కమిటీ ఉంటుంది. జిల్లస్థాయి కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. బాధితులు ఈ కమిటీలకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో మహిళలు వేధింపులకు గురైనా చెప్పుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులకు చెబితే ఏమైనా సమస్యలు ఎదురవుతాయేమోనని లోలోపలే మదనపడుతున్నారు. కమిటీలు అంతర్గతంగా ఉంచినా ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. ప్రతీ శాఖలో లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నా ధైర్యంగా ఫిర్యాదు చేయడం లేదు.

ధైర్యంగా ఫిర్యాదు చేసేలా..

ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి కమిటీలను బలోపేతం చేయడంతో పాటు, బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించాలి. అలాగే ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. కొన్ని ఘటనల్లో నాన్చుడు ధోరణి వల్ల ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదన్న భావన మహిళ ఉద్యోగుల్లో కన్పిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి వేధింపులు అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అంసరం ఎంతైనా ఉంది.

మహిళలు వేధింపులకు గురైనప్పుడు ధైర్యంగా కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళలు నిర్భయంగా విధులు నిర్వర్తించాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.

– సత్యప్రసాద్‌, కలెక్టర్‌

● ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు? ● మహిళా ఉద్యోగులకు  రక్షణ ఏ1
1/2

● ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు? ● మహిళా ఉద్యోగులకు రక్షణ ఏ

● ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు? ● మహిళా ఉద్యోగులకు  రక్షణ ఏ2
2/2

● ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు? ● మహిళా ఉద్యోగులకు రక్షణ ఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement