జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 2.16 లక్షల కూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్ల ఎత్తి 35,293 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే వరద కాల్వకు 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాల్వకు 400, లక్ష్మి కెనాల్‌కు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మెట్‌పల్లి(కోరుట్ల): వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆరు నెలలకు పైగా ఏజెన్సీ నిర్వాహకులు తమకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. దీంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులు సక్రమంగా నిర్వహిస్తున్న తమకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని బకాయిలు పూర్తిగా చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ధర్మపురి: నాటిన మొక్కలను సంరక్షించాలని జిల్లా పంచాయతీ అధికారి మదన్‌మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాటుదాం ఒక మొక్క అమ్మ పేరుమీద’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మగ్గిడి పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతీ విద్యార్థి తమ అమ్మ పేరుమీద ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఎంపీడీవో రవీందర్, ఏపీవో సృజన్, ఏఈఈ వివేకానంద, ప్రత్యేకాధికారి ఎంఈవో సీతామహాలక్ష్మి తదితరులున్నారు.
మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలో బయో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్న వైనంపై ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి హై దరాబాద్‌లోని మున్సి పల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మోహన్‌ను ఆదేశించారు. దీంతో ఆయన ..స్థానికంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇవ్వాలని శానిటేషన్ విభాగం ఇన్‌చార్జి అక్షయ్‌కు సూచించారు. ఈ మేరకు శుక్రవారం పలు ఆసుపత్రులకు నోటీసులు అందజేశారు. ఆసుప్రతుల్లోని బయో వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారో ఆ సమాచారం లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. అలాగే ఆర్‌ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి నుంచి కూడా బయోవ్యర్థాల సమాచారం తీసుకోవాలని నిర్ణయించామని అక్షయ్ తెలిపారు.
మల్లాపూర్(కోరుట్ల): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు ప్రమాణాలు పాటించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. రోజూ విద్యార్థులు భోజనం తినే ముందు ఉపాధ్యాయులు విధిగా పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట ఎంఈవో దామోదర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఎస్సారెస్పీకి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఎస్సారెస్పీకి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఎస్సారెస్పీకి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో