
పంపిణీకి సిద్ధంగా బతుకమ్మ చీరలు
జగిత్యాలరూరల్: బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం స్వశక్తి మహిళలకు బతుకమ్మ చీరలు అందించేందుకు సిద్ధమైంది. ఒక్కో మహిళకు రెండు చీరల చొప్పున అందించనున్నారు. జిల్లాలో 20,886 సంఘాల్లో 2,39,950 మంది మహిళలు ఉన్నారు. ఆరున్నర మీటర్ల చీరలను 1,84,673 మందికి.. 9 మీటర్ల చీరలను 55,277 మందికి అందించనున్నారు.
మహిళలకు బతుకమ్మ కానుకగా..
గతంలో మాదిరిగానే బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ధర్మపురి నియోజకవర్గానికి ఎస్సీ హాస్టల్ ధర్మపురిలో.. జగిత్యాల నియోజకవర్గానికి నూకపల్లి న్యాక్ సెంటర్‌లో.. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు కోరుట్ల సీ్త్రశక్తి భవన్‌లో.. కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల మెప్మా కార్యాలయంలో చీరలను సిద్ధంగా ఉంచారు.