
మోదీ పాలనలో అగ్రగామిగా దేశం
పెగడపల్లి: ప్రధాని మోదీ పాలనలో దేశం అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జెండా విష్కరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేంద్ర పథకాలను ఇంటింటికీ వివరించాలన్నారు. అనంతరం కాటం నర్సింహరెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ధర్మపురి ఇన్‌చార్జి అంజయ్య, జిల్లా అధికార ప్రతినిధి సత్యం, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనసూర్య, మహేశ్, హరీశ్, రవీందర్‌రెడ్డి, కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు.