
రాయికల్ శివాలయంలో చోరీ
● పోలీస్‌ల అదుపులో నిందితుడు?
రాయికల్: రాయికల్ పట్టణంలోని శివాలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోని హుండిని పగలగొట్టి నగదును దొంగలించారు. దొంగ ముందస్తుగా సీసీ కెమెరాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించాడు. దానికి ముందు రికార్డయిన వీడియో ఆధారంగా ఆదివారం సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
● ఫేస్‌బుక్‌లో పోస్టుపై పోలీసులు కొట్టారని మనస్తాపం
● సెల్ఫీ వీడియోతో ఎలుకల మందు తాగిన వైనం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: త మ ఊరికి బస్సు కావాలంటూ ఓ యువకుడు పెట్టిన పోస్టు అతని ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. అకారణంగా తనను పోలీసులు చావబాదారని మనస్తాపం చెందిన ఆ యువకుడు.. సెల్ఫీ వీడి యో తీసుకుంటూ ఎలుకల మందు తాగాడు. గంగాధర మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన బండారి శ్రీనివాస్ తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దీనిపై నాచుపల్లి శ్రీనివాస్ ఫోన్ చేసి దూషించాడు. శనివారం ఉదయం మల్యాల పోలీసులు శ్రీనివా స్‌ను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అక్కడ ఎస్సై నరేశ్ తనను దుర్భాషలాడుతూ రోజంతా చితకబాదా రని, అందుకే తాను మనస్తాపంతో ఎలుకల మందు తాగుతున్నాను అంటూ శ్రీనివాస్ వీడియోలో పేర్కొన్నాడు. తన చావుకు ఎస్సై నరేశ్, కాంగ్రెస్ నేత కారణమని, గతంలో తాను ఇదే విషయమై ఎన్ని పోస్టులు పెట్టినా ఏనాడూ ఇలాంటి పరిస్థితి ఎదురవలేదని, పైగా తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని వాపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

రాయికల్ శివాలయంలో చోరీ