
పసిబిడ్డ వైద్యానికి ‘నవదుర్గ’ చేయూత
ఆర్థిక సాయం అందిస్తున్న నవదుర్గ సేవ సమితి సభ్యులు
రాయికల్: పట్టణానికి చెందిన కట్టెకోల సుధాకర్, అర్చన దంపతుల కూతురు బరువు తక్కువ ఉండడంతో వైద్యానికి డబ్బులు అవసరం అయ్యాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ఈనెల 9న ‘పసిబిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన నవదుర్గ సేవా సమితి (మార్కండేయ నగర్) ఆధ్వర్యంలో రూ.28,500ను ఆదివారం కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు గంట్యాల ప్రవీణ్, ఉపాధ్యక్షులు మధు, శ్రీరాముల సాయి ప్రధాన కార్యదర్శి మూర చైతన్య, కోశాధికారి రాము, గౌరవ అధ్యక్షులు గట్టు వినయ్, గొల్లవర్తి భరత్, సుజిత్ పాల్గొన్నారు.
జగిత్యాలటౌన్: నాలుగు దశాబ్దాలుగా రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం పావని కంటి ఆస్పత్రి, ఆపి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన 22మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. మందులు, కళ్లజోళ్లు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి కళ్లకు సంబంధించిన మైక్రో శస్త్రచికిత్స మిషన్ అందుబాటులోకి వచ్చిందని, వైద్యులు కూడా అందుబాటులో ఉంటారని, రోగులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ మంచాల కృష్ణ, సభ్యులు చారి, టీవీ.సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, వైద్యులు ధీరజ్, విజయ్ ఉన్నారు.
జగిత్యాలటౌన్: ఈనెల 21నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను సంస్కార భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. సంస్కార భారతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గంట్యాల ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ ఉత్సవాలన్నారు. పూలను పూజించే బతుకమ్మ పండుగను తెలంగాణతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భీమయ్య, ఉపాధ్యక్షుడు కట్ట విజయ్, రచయిత్రి, ఉపాధ్యాయురాలు అయిత అనిత, సుచరిత, వేముల చంద్రశేఖర్, గొల్లపల్లి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని, లేకుంటే చెరుకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల కాంతయ్యచారి అన్నారు. మండలంలోని కొత్తదాంరాజుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. చెరుకు రైతులను మభ్యపెట్టేందుకే పునరుద్ధరణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని వాడుకున్నట్లు రైతులకు అర్థమైందన్నారు. ఫ్యాక్టరీ అంశాన్ని ఎంపీ అర్వింద్‌కు అప్పగిస్తే తెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బూత్ అధ్యక్షుడు బద్దం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల నర్సారెడ్డి, ఎగ్యారపు శ్రీకాంత్, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

పసిబిడ్డ వైద్యానికి ‘నవదుర్గ’ చేయూత

పసిబిడ్డ వైద్యానికి ‘నవదుర్గ’ చేయూత

పసిబిడ్డ వైద్యానికి ‘నవదుర్గ’ చేయూత

పసిబిడ్డ వైద్యానికి ‘నవదుర్గ’ చేయూత