రాయికల్: పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పథకం కింద రాయికల్ బల్దియాకు మంజూరైన రూ.15 కోట్లతో మాదిగకుంటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మాజీమంత్రి జీవన్ రెడ్డి అధికారులకు సూచించారు. పట్టణంలోని మాదిగకుంటను స్థానిక నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి కుంట సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపాలన్నారు. ఎస్సారెస్పీ కాలువను అనుసంధానించి కుంటను పరిశుభ్రంగా ఉంచి పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, నాయకులు కొయ్యడి మహిపాల్‌రెడ్డి, బాపురపు నర్సయ్య, బత్తిని భూమయ్య పాల్గొన్నారు.