బీరుసీసాలతో యువకుల దాడులు | - | Sakshi
Sakshi News home page

బీరుసీసాలతో యువకుల దాడులు

Sep 15 2025 8:21 AM | Updated on Sep 15 2025 8:21 AM

బీరుసీసాలతో యువకుల దాడులు

బీరుసీసాలతో యువకుల దాడులు

సుల్తానాబాద్‌రూరల్‌: మద్యం మత్తులో యువకులు బీరుసీసాలతో స్పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఓ వైన్స్‌ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌లోని మార్కెండేయకాలనీకి చెందిన యువకులు అనిల్‌, టోన్‌ ఓ వైన్స్‌ వద్ద మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఇద్దరూ బీరుసీసాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలుకాగా స్థానికులు సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్యచికిత్స అందిస్తున్నారు.

మద్యం మత్తులో వీరంగం

ఇద్దరికి తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement