
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
జగిత్యాల: పట్టణాభివృద్ధే తన ధ్యేయమని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ప్రతి మైదానంలో ఓపెన్‌జిమ్‌లు, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు, పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్య, వైద్యం కోసం భవనాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, వొద్ది శ్రీలత పాల్గొన్నారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పలు సమస్యలపై పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందింశారు. పెన్షనర్లు సమాజ మార్గదర్శకులని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. సీనియర్ సిటిజన్స్ హరి అశోక్‌కుమార్, హన్మంతరెడ్డి, విజయ్, విశ్వనాథం, ప్రకాశ్, యాకూబ్ పాల్గొన్నారు.