
కొండగట్టుకు రండి
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించాలని ఆలయ అధికారులు, అర్చకులు త్రిదండి చిన్న జీయర్ స్వామిని ఆహ్వానించారు. ఆయనను హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో కలిశారు. వీరిలో ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, రాంచంద్రప్రసాద్ ఉన్నారు.
జగిత్యాల: కొందరు ఎమ్మెల్యేలు అభివృద్ధి ముసుగులో ఫిరాయింపులకు దారి తెరిచారని, నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వంచించి కార్యకర్తలను నట్టేట ముంచారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. శనివారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదవి పోతుందన్న భయంతోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. నిజం ఎప్పుడూ దాగదని, పాపం పండక మానదని తెలిపారు. పదవీగండం రాగానే బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని బుకాయిస్తున్నారన్నారు. నాయకులు మల్లేశం, గంగాధర్, ఆనందరావు, దేవేందర్‌నాయక్, సత్యంరావు పాల్గొన్నారు.
మల్యాల/సారంగాపూర్: ఆర్యవైశ్య అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత అన్నారు. మల్యాల మండలంలో వాసవి ట్రస్టు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 250మంది ఆర్యవైశ్య ఉపాధ్యాయులను సన్మానించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి.. సంఘాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.25కోట్లు కేటాయించారని అన్నారు. మైలారపు లింబాద్రి, రాంబాబు, బూస శ్రీనివాస్, ఊటూరి నవీన్, మైలారపు రాంబాబు, కొత్త సురేశ్, కమటాల శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.
వాసవి ఆలయ నిర్మాణం మహాసంకల్పం
సారంగాపూర్ మండలం పెంబట్లలో రూ.12 కోట్ల వ్యయంతో ఆర్యవైశ్యులు నిర్మిస్తున్న వాసవికన్యకాపరమేశ్వరి ఆలయం మహాసంకల్పమని సుజాత అన్నారు. పెంబట్లలోని దుబ్బరాజేశ్వరస్వామిని దర్శించుకుకున్నా రు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మర్యాల రాజన్న, గుండ సురేశ్ తదితరులు ఉన్నారు.

కొండగట్టుకు రండి

కొండగట్టుకు రండి