
పత్రికలపై కక్ష సాధింపు సరికాదు
ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే పత్రికల గొంతునొక్కడం సమంజసం కాదు. సాక్షి పత్రిక ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే సరిచేసుకోవాలేగానీ కేసులు నమోదు చేయడం సరికాదు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టడం సరికాదు. పత్రికలకు స్వేచ్ఛ వాతావరణం ఉండాలే కానీ ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు.
– జీవన్‌రెడ్డి, మాజీమంత్రి
జగిత్యాల: ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ‘సాక్షి’ దినపత్రికపై కక్షసాధింపులు సరికాదని, పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేయకూడదని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం శ్రీసాక్షిశ్రీ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టడాన్ని ఖండించారు.
ప్రజా సమస్యలపై ఎళ్లప్పుడూ గళమెత్తుతున్న పత్రికలపై కక్షసాధింపు సరికాదు. ప్రజాస్వామ్యంలో పత్రిక వ్యవస్థ ఎంతో గొప్పదన్న విషయం మర్చిపోవద్దు. ఇలాంటి అక్రమ కేసులు దిగజార్చుతాయి. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి.
– సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే, జగిత్యాల
ప్రజాస్వామ్యంలో పత్రికలకే స్వేచ్ఛ ఉంటుంది. అలాంటి పత్రికల గొంతు నొక్కడం స రికాదు. ప్రజాసమస్యలను ఎ ప్పటికప్పుడు తెలిపేవే పత్రికలు. అలాంటి వాటిపై కక్షసాధింపు సరికాదు. పత్రిక స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల

పత్రికలపై కక్ష సాధింపు సరికాదు

పత్రికలపై కక్ష సాధింపు సరికాదు

పత్రికలపై కక్ష సాధింపు సరికాదు