
ఉత్తమ జట్టును ఎంపిక చేయాలి
పాఠశాలల క్రీడలకు పూర్వ వైభ వం వచ్చింది. కరో నా అనంతరం ఈ సంవత్సరం జరుగుతున్న పో టీలకు పెద్దసంఖ్యలో క్రీడాకా రులు హాజరవడం శుభపరిణా మం. ఆయా జిల్లాల ఎస్జీఎఫ్ కా ర్యదర్శులు ఉత్తమమైన, పటిష్టమైన ఉమ్మడి జిల్లా జట్టును ఎంపి క చేసి రాష్ట్ర పోటీలకు పంపించాలి. – నందెల్లి మహిపాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు
విజేతగా నిలవాలి
69వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు విజేతగా నిలవాలి. ఎస్జీఎఫ్ క్రీడల్లో నంబర్‌వన్‌గా ఎదగాలి. జిల్లా, ఉమ్మడి జిల్లా పోటీలకు ఒలింపిక్ సంఘం సహాయ, సహకారాలందిస్తాం. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఘనంగా నిర్వహించాలి.
– గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి
మంచి స్పందన..
కరీంనగర్ జిల్లాలో పెద్దసంఖ్యలో ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న. క్రీడలకు తలమానికంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో క్రీడలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మండలస్థాయి పోటీలకు మంచి స్పందన వచ్చింది. జిల్లాస్థాయి పోటీలను కూడా అదే స్ఫూర్తితో నిర్వహిస్తాం.
– బి.వేణుగోపాల్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, కరీంనగర్
ఘనంగా నిర్వహిస్తాం
పెద్దపల్లి జిల్లాలో జరగనున్న ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మండలస్థాయి, మండల జోన్‌స్థాయి పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. క్రీడాకారులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. జిల్లాస్థాయి పోటీలు కూడా త్వరలోనే నిర్వహిస్తాం.
– కనుకుంట్ల లక్ష్మణ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, పెద్దపల్లి

ఉత్తమ జట్టును ఎంపిక చేయాలి

ఉత్తమ జట్టును ఎంపిక చేయాలి

ఉత్తమ జట్టును ఎంపిక చేయాలి