
130 మంది మందుబాబులకు జరిమానా
● డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ యువత
వేములవాడ: వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి లో 14 రో జులుగా నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ 130 మంది మందుబాబు లను శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిలో 70 మంది ద్విచక వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.2వేలు, 30 మంది ద్విచక్ర వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.5వేలు, 30 మంది టూవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తూ వేములవాడ మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఠాణా ఆవరణలో వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేపించారు.
అదుపుతప్పి బోల్తాపడిన ఆటో
శంకరపట్నం: కేశవపట్నం గ్రామంలో శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో నలుగురికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపా రు. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఆరుగురు ఆటోలో తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో బంధువుల సంవత్సరికానికి వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలోని నలుగురు మహిళలకు గాయాలు కాగా మరో ఆటోలో చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
గంజాయి విక్రేతల రిమాండ్
వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎ ల్లారెడ్డిపే ట సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మండలంలో ని గర్జనపల్లికి చెందిన భరత్, దినేశ్ వీర్నపల్లిలో గంజాయి విక్రయిస్తుండగా ఎస్సై వేముల లక్ష్మణ్ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు.