
రోడ్డుపైకి వ్యాపారాలు
ఇది యావర్‌రోడ్డు. మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట మెట్లు ఉండగా ఇబ్బందికరంగా ఉందని చెప్పి తొలగించారు. కొందరు మెట్లు తొలగించిన చోటే పండ్లబండ్లు పెట్టి అమ్ముతున్నారు. మెట్లు తొలగించడం కన్నా ఎక్కువగా రోడ్డు కబ్జాచేసి విక్రయాలు సాగిస్తున్నారు.
జగిత్యాల: జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఆస్పత్రులు, సూపర్‌మార్కెట్లు, వ్యాపార సముదాయాలు వెలుస్తున్నాయి. ట్రాఫిక్ పెరిగి.. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. కొత్తబస్టాండ్ నుంచి టవర్‌సర్కిల్ వరకు, తహసీల్ చౌరస్తా నుంచి జంబిగద్దె వరకు, జంబిగద్దె నుంచి అశోక్, పాతబస్టాండ్ ఏరియాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దుకాణాల నేమ్‌బోర్డులు, ఫ్లెక్సీలతో కూడిన బోర్డులు రోడ్డుపై పెడుతున్నారు. ఇది ప్రజ లకు ఇబ్బందికరంగా మారుతోంది. అసలే ఇరుకై న రోడ్లు కావడం, రోడ్లను ఆనుకుని బోర్డులు ఏర్పా టు చేయడంతో వాహనదారులకు పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. కార్లు, ఆటోలు అటువైపు వెళ్లే పరిస్థితి లేదు. కొందరైతే దర్జాగా రోడ్లను ఆనుకుని రేకులషెడ్లు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా బల్దియా అధికారులు స్పందించి రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేసేవా రిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ‘రోడ్లను ఆనుకుని బోర్డులు పెట్టవద్దు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు. అలాంటి వారికి నోటీసులు ఇస్తాం’ అని టీపీవో శ్రీనివాస్ వివరించారు.
జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీ ఇది. ఇక్కడ పదుల సంఖ్యలో ఆస్పత్రులున్నాయి. ఆస్పత్రుల సూచిక బోర్డులు రోడ్డుపైనే పెట్టడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందిగా మారింది. వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకుండా పోతోంది. శుక్రవారం ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అంబులెన్స్‌లో ఈ దారిలో ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. రోడ్డు ఇరుకుగా మారడంతో అంబులెన్స్ 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. రోడ్డు ఆక్రమణలపై టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

రోడ్డుపైకి వ్యాపారాలు

రోడ్డుపైకి వ్యాపారాలు